శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 10:20:55

నేను ఐశ్వ‌ర్య‌రాయ్ కుర్రాడినంటూ ఓ వ్య‌క్తి హ‌ల్ చ‌ల్‌

నేను ఐశ్వ‌ర్య‌రాయ్ కుర్రాడినంటూ ఓ వ్య‌క్తి హ‌ల్ చ‌ల్‌

కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెల‌చుకున్న బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్. అభిషేక్ బ‌చ్చ‌న్‌ను వివాహం చేసుకున్న ఐష్.. ఆరాధ్య అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చింది. ఐష్‌కు ఒక్క‌తే కూతురు కాగా, నేను ఐశ్వ‌ర్య‌రాయ్ కొడుకును అంటూ 32 ఏళ్ల సంగీత్ కుమార్ అనే వ్య‌క్తి  ర‌చ్చ చేస్తున్నాడు. నేను ఐశ్వర్యరాయ్‌కి IVF విధానంలో పుట్టాను. 1967లో నేను ఐష్‌కు జ‌న్మించ‌గా, అప్పుడు ఆమె వ‌య‌స్సు 15. నా తండ్రి న‌న్ను లండ‌న్ నుండి వైజాగ్‌కు తీసుకు రాగా, ఓ రెండేళ్ల‌పాటు ఐష్ త‌ల్లిదండ్రులు న‌న్ను చూసుకున్నారు.

నా ద‌గ్గ‌ర ఎలాంటి ఆధారాలు లేకుండా ఐష్ సంబంధీకులు నా బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్ అన్నీ చింపేశారు. ఐశ్వ‌ర్య‌రాయ్‌కు నేను మొద‌టి కొడుకును అంటూ సంగీత్ కుమార్ అనే వ్య‌క్తి  బీటౌన్‌లో హంగామా సృష్టిస్తున్నాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు అత‌నికి మాన‌సిక స్థితి బాగోలేద‌ని చెప్పారు. గ‌తంలోను ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే వెలుగులోకి వ‌చ్చాయి. 

VIDEOS

logo