సోమవారం 01 జూన్ 2020
Cinema - May 22, 2020 , 10:24:20

మ‌ల‌యాళ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్న సందీప్..!

మ‌ల‌యాళ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్న సందీప్..!

ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం రీమేక్‌ల ట్రెండ్ న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళంలో మంచి విజ‌యం సాధించిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ చిత్ర రైట్స్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ద‌క్కించుకోగా ఏ ద‌ర్శ‌కుడితో ఈ రీమేక్ చేయాలా అని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. 

హ‌రీష్ శంక‌ర్, సుధీర్ వ‌ర్మ‌, సందీప్ రెడ్డి వంగా ఈ ముగ్గురిలో ఒక‌రితో అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రాన్ని డైరెక్ట్ చేయించాల‌ని నిర్మాణ సంస్థ భావించింది. దాదాపు సందీప్ రెడ్డి ఫైన‌ల్ అయిన‌ట్టు టాక్స్ టాక్స్ వినిపిస్తుండ‌గా, ఇందులో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర పోషించనున్న‌ట్టు స‌మాచారం. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. థ్రిల్ల‌ర్ మూవీగా ఈ చిత్రాన్ని స‌చి తెర‌కెక్కించారు 


logo