సందీప్‌కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ ‘వారసత్వంతో రౌడీగా మారిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఇష్టంలేకపోయినా పరిస్థితుల కారణంగా రౌడీగా బతకాల్సివచ్చిన అతడికి ఎదురైన పరిణామాలు ఆసక్తిని పంచుతూనే నవ్విస్తాయి. గత చిత్రాలకు భిన్నంగా సందీప్‌కిషన్ కనిపిస్తారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటకు చక్కటి స్పందన లభిస్తోంది. సెన్సార్ పూర్తికాగానే విడుదలతేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. బాబీసింహ, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తిక్, స్క్రీన్‌ప్లే, సమర్పణ: కోన వెంకట్.