బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 09:28:39

హీరోయిన్‌పై దాడికి య‌త్నించిన యువ‌కులు

హీరోయిన్‌పై దాడికి య‌త్నించిన యువ‌కులు

క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది యువకులు దాడి చేశారు. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి వ‌ర్కవుట్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌బ్లిక్ పార్క్‌లో అసభ్య‌క‌ర‌మైన దుస్తులు ధ‌రించి ఇలా చేయ‌డం ఏంటి అని మంద‌లించ‌డంతో ఈ వివాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

ప్ర‌తి రోజు పార్క్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న సంయుక్త‌పై ఎవ‌రో ఫిర్యాదు చేయ‌డంతో ఆ యువ‌కులు వ‌చ్చినట్టు స‌మాచారం. సంయుక్త‌పై దాడి చేసే క్ర‌మంలో పోలీసులు రంగ ప్ర‌వేశంతో చేయ‌డంతో ఆమె క్షేమంగా బ‌య‌ట‌ప‌డింది. అయితే త‌న‌పై సామాజిక కార్య‌కర్త‌లం అంటూ దాడి చేయ‌డానికి వ‌చ్చిన వారిని వీడియో ద్వారా చూపించింది. స్పోర్ట్స్ బ్రా ధ‌రించ‌డం నేరమా, ఇదేనా ఇండియాలో ఉన్న మాకు ఉన్న స్వాతంత్ర్యం అంటూ ప్ర‌శ్నించింది. అయితే పోలీసులు సంయుక్త‌తో పాటు సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ వ‌చ్చిన వారిని స్టేష్‌న్‌కు తీసుకెళ్లి విచారించారు. హిందుత్వంకు వ్యతిరేకంగా ఆమె చేస్తుందంటూ సామాజిక కార్యకర్తలు చెప్పుకొచ్చారు. అయితే ప్ర‌స్తుతం ఈ వివాదంపై విచార‌ణ మొద‌లు పెట్టిన పోలీసులు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. 


logo