బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 17:16:50

క్రాక్‌లో 'క‌టారి' లుక్ ఇదే..!

క్రాక్‌లో 'క‌టారి' లుక్ ఇదే..!

త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఇప్పుడు తెలుగులోను సత్తా చాటుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన అల వైకుంఠ‌పురం చిత్రంలో విల‌న్ రోల్‌లో అద‌ర‌గొట్టిన సముద్ర‌ఖని ప్ర‌స్తుతం క్రాక్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ర‌వితేజ, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం రూపొందుతుండ‌గా,  గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.  వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో 'కటారి' పాత్రలో నటిస్తోన్న సముద్రఖని లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు.  చేతిలో కత్తి పట్టుకొని ఓల్డ్ గెటప్ లో గంభీరంగా కనిపిస్తున్న సముద్రఖనిని చూస్తుంటే ఆయ‌న  విలన్ పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో రవితేజ హీరోగా నటించిన ‘శంభో శివ శంభో’లో చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ వెర్షన్ లకు ఆయనే దర్శకుడు కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న‌ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలోనూ స‌ముద్ర ఖ‌ని నటిస్తున్నాడు.


logo