సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 09:44:45

క‌రోనా వైర‌స్‌పై సంపూ సినిమా..!

క‌రోనా వైర‌స్‌పై సంపూ సినిమా..!

ప్ర‌స్తుతం ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు సినిమాలు రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేస్తుండ‌గా, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా క‌రోనా వైర‌స్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చేస్తారా లేదంటే సీరియ‌స్ డ్రామాగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. గ‌త సంవ‌త్స‌రం కొబ్బ‌రి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంపూ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేద‌నే సంగ‌తి తెలిసిందే. 


logo