బుధవారం 27 మే 2020
Cinema - Apr 24, 2020 , 09:43:18

భార్య‌, పిల్ల‌ల కోసం కంసాలిగా మారిన సంపూర్ణేష్‌

భార్య‌, పిల్ల‌ల కోసం కంసాలిగా మారిన సంపూర్ణేష్‌

హృద‌య కాలేయం చిత్రంతో బ‌ర్నింగ్ స్టార్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు సంపూర్ణేష్ బాబు. మంచి మానవ‌తా దృక్ప‌థం ఉన్న సంపూ సంక్ష‌భంలో త‌న వంతు సాయం చేయ‌డానికి ఎల్ల‌ప్పుడు ముందుంటారు. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటీ సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించారు.

లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైన సంపూర్ణేష్ బాబు భార్య‌, పిల్ల‌ల కోసం కంసాలిగా మారి బీ ది రియ‌ల్ మ్యాన్ అని నిరూపించాడు. ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా చేసిన‌ట్టు పేర్కొన్నాడు. త‌న ట్విట్ట‌ర్‌లో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ..రాజు పేద తేడా లేదు...నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ,  మా ఆవిడ కోసం, నా పాత "కంసాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను అని ట్వీట్‌లో రాసాడు బ‌ర్నింగ్ స్టార్ . చివ‌రిగా కొబ్బ‌రి మ‌ట్ట అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు సంపూర్ణేష్‌.



logo