సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాత. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ ఇటీవల జరిగింది. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ‘ఆద్యంతం హాస్యప్రధానంగా అలరించే చిత్రమిది. బజార్ రౌడీ చేసే హంగామా నవ్వుల్ని పంచుతుంది’ అన్నారు. విభిన్న కథాంశంతో వినోదానికి పెద్దపీట వేస్తూ ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, సంపూర్ణేష్‌బాబు కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలుస్తుందని నిర్మాత తెలిపారు.