e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home సినిమా సంపూర్ణేష్‌ క్యాలీఫ్లవర్‌

సంపూర్ణేష్‌ క్యాలీఫ్లవర్‌

సంపూర్ణేష్‌ క్యాలీఫ్లవర్‌

సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. ‘శీలో రక్షతి రక్షిత’ ఉపశీర్షిక. ఆర్‌.కె మలినేని దర్శకుడు. ఆశాజ్యోతి గోగినేని నిర్మాత. వాసంతి కథానాయిక. సంపూర్ణేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ఇందులో ఆంగ్లేయుడి గెటప్‌లో గుర్రాన్ని నడుపుతూ సరికొత్త గెటప్‌లో సంపూర్ణేష్‌బాబు కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిది. ఇందులో ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చే వ్యక్తిగా సంపూర్ణేష్‌ కనిపిస్తారు. ఆయన మార్కు కామెడీతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం’ అని తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, ఛాయాగ్రహణం: ముజీర్‌ మాలిక్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంపూర్ణేష్‌ క్యాలీఫ్లవర్‌

ట్రెండింగ్‌

Advertisement