కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. కంకణాల ప్రవీణ నిర్మాత. గురువారం సినిమా తాలూకు ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సంగీతభరిత ప్రేమకథా చిత్రమిది. నగర నేపథ్యంలో నడుస్తుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన నాయకానాయికల ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తాడు. ప్రేమ ప్రయాణంలోని జ్ఞాపకాలకు అందమైన దృశ్యరూపంలా ఉంటుంది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం’ అన్నారు. షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి, నిర్మాణ సంస్థ: యూజీ ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.