సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 11:14:22

మ‌ద్యం మ‌త్తులో ‘కోయిలమ్మ’ సీరియ‌ల్ న‌టుడు వీరంగం

మ‌ద్యం మ‌త్తులో ‘కోయిలమ్మ’  సీరియ‌ల్ న‌టుడు వీరంగం

‘కోయిలమ్మ’   సీరియ‌ల్ న‌టుడు స‌మీర్ అలియాస్ అమ‌ర్  మ‌ద్యం మ‌త్తులో వీరంగం సృష్టించాడు. తాగిన నిషాలో మణికొండలో  ఒంట‌రిగా ఉంటున్న ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి  దిగాడు. వారితో  అసభ్యంగా మాట్లాడుతూ  రెచ్చిపోయాడు.  రాత్రి  తొమ్మిది గంటలకు  మహిళ ఇంటికెళ్లి దౌర్జ‌న్యం చేసి ఆమె ద‌గ్గరున్న వస్తువుల‌ని లాక్కెళ్లి లైంగిక వేధింపులు చేశారని  మహిళ కంప్లైంట్ చేసింది. స‌మీర్‌తో పాటు ముగ్గురు వ్య‌క్తులు, ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్ త‌మ‌పై దాడి చేశార‌ని బాధితులు పేర్కొన్నారు. 

శ్రీవిద్య, అపర్ణ‌లు కొద్ది రోజులుగా మ‌ణికొండ‌లో బొటిక్ వ్యాపారం చేసుకుంటుండ‌గా, వారి  ద‌గ్గ‌ర నుండి  ఐదు లక్షల నగదు తీసుకున్నారు స‌మీర్.  అవి  అడిగితే రౌడీయిజం చేస్తున్నాంటూ  మహిళలు రాయదుర్గం పీస్‌ను  ఆశ్రయించారు. మాకు స‌మీర్  నుంచి ప్రాణహాని ఉంది అంటూ ఓ మహిళ వేడుకుంది.  దీంతో అలర్ట్ అయిన పోలీసులు మహిళలకి రక్షణ ఇచ్చి  కోకిలమ్మ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన స‌మీర్ .. నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అన్ని విష‌యాలు పోలీసుల ముందు చెబుతా. ఎవరికి సంజాయిషీ ఇచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని స‌మీర్ అన్నాడు.

VIDEOS

logo