గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 17:27:21

ఉపాసన కోసం చెఫ్‌గా మారిన సమంత

ఉపాసన కోసం చెఫ్‌గా మారిన సమంత

అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ‘యూ ఆర్ లైఫ్’ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ముఖ్యంగా ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే. ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత, ఉపాసనతో కలిసి ‘తక్కలి సదం’ వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియోలో చూపించారు. వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్‌లో పాల్గొన్నారు. సమంత కూడా ఈ మధ్య ‘అర్బన్ ఫామింగ్’ పేరుతో ఆరోగ్యంపై, తినే ఆహారంపై చాలా శ్రద్ధ తీసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. వీళ్లిద్దరు కలిసి అందరికీ ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చూడ ముచ్చటగా ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo