టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇంట్లో హష్ అనే పెంపుడు కుక్క ఉన్న సంగతి తెలిసిందే. ఈ పెంపుడు కుక్క తనకు బిడ్డలాంటిదని సమంత పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హష్ని ఎంతగానో ప్రేమించే సమంత ఆ మధ్య తన బర్త్‌డే వేడుకలని కూడా గ్రాండ్‌గా జరిపింది. హష్‌కు ఆరోగ్యం బాగా లేకపోయినా సమంత దగ్గరుండి చూసుకుంటారు. ఆ మధ్య తన బిడ్డ హష్‌కు ఆరోగ్య బాగా లేదని, స్కిన్ఎలర్జీ వచ్చిందని సమంత అందరి సలహాలు అడిగారు.
తను బోరింగ్‌గా ఫీలయ్యే సమయంలో సమంత హష్‌తో సరదా సమయం గడుపుతూ ఉంటుంది. తాజాగా హష్‌తో కలిసి గార్డెన్ ఏరియాలో ఆటలాడింది సామ్. గాల్లో ఎగురుతున్న బెలూన్‌తో హష్, సమంతలు సరదాగా ఆడుతుంటే దీనిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సమంత షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టింది సమంత. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణను గత నెలాఖరున ప్రారంభించారు. ఇటీవల సమంత చిత్రీకరణలో భాగమైంది.