శుక్రవారం 29 మే 2020
Cinema - Feb 23, 2020 , 07:07:09

పాపుల‌ర్ షోకి హోస్ట్‌గా క‌నిపించ‌నున్న స‌మంత‌..!

పాపుల‌ర్ షోకి హోస్ట్‌గా క‌నిపించ‌నున్న స‌మంత‌..!

అక్కినేని కోడ‌లు స‌మంత‌లో దాగి ఉన్న ప్ర‌త్యేక టాలెంట్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌టిగా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ ఏర్ప‌ర‌చుకున్న స‌మంత ప్ర‌స్తుతం హోస్ట్‌గాను అల‌రించాల‌ని అనుకుంటుంద‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌మంత ప్ర‌ముఖ పాపుల‌ర్ ఓటీటీ యాప్ కోసం రూపొంద‌నున్న‌ షోలో హోస్ట్‌గా క‌నిపించ‌నుంద‌ట‌. ఈ షో త‌న మామ హోస్ట్ చేసిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మాదిరిగానే ఉంటుంద‌ని తెలుస్తుంది. రియాలిటీ షోకి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న మ‌రి కొద్ది రోజుల‌లో రానుంద‌ని అంటున్నారు. స‌మంత చివ‌రిగా జాను చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమాలో స‌మంత న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం అమేజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం కానున్న ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. దీంతో పాటు విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ఓ త‌మిళ చిత్రం చేస్తుంది. 


logo