శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 08:37:02

బిగ్ బాస్ హౌజ్‌లో స్వ‌యంవరం.. బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌దెవ‌రు?

బిగ్ బాస్ హౌజ్‌లో స్వ‌యంవరం.. బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌దెవ‌రు?

వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం నాగార్జున మ‌నాలీకి వెళ్ళ‌డంతో ఈ వారం బిగ్ బాస్ కార్య‌క్ర‌మాన్ని స‌రికొత్త‌గా ప్లాన్ చేశారు నిర్వాహ‌కులు. శనివారం రోజు అవార్డ్ కార్య‌క్ర‌మం పేరుతో హోస్ట్ లేకుండా కానిచ్చేరు. ఇక ఆదివారం అందులోను ద‌స‌రా కావ‌డంతో భారీ ఎత్తున ఎంట‌ర్‌టైన్ చేసేందుకు హోస్ట్‌గా స‌మంత‌ని తీసుకొచ్చారు. ఆమెతో పాటు కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, హైప‌ర్ ఆది, గీతా మాధురి, పలువురు సింగ‌ర్స్ బిగ్ బాస్ వేదిక‌పై నుండి ప‌సందైన వినోదాన్ని అందించారు.

కార్య‌క్ర‌మం మొద‌ట్లో నాగార్జున మ‌నాలీ నుండి వీడియా ద్వారా మాట్లాడ‌గా, ఆ త‌ర్వాత స‌మంత‌కు స్వాగ‌తం చెప్పారు. ఈ వారం త‌ను అందుబాటులో లేని కార‌ణంగా కోడ‌లు పిల్ల స‌మంత హోస్ట్ చేస్తుంద‌ని చెప్ప‌డంతో హౌజ్‌మేట్స్ ఎగిరి గంతేశారు. ఇక స‌మంత షోని టేక‌ప్ చేసిన వెంట‌నే నాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉండ‌దు అని చెప్పి ఇంట్లో ఉన్న అమ్మాయిల గురించి, వారి అభిప్రాయాల గురించి వివ‌రించింది.  అయితే అబ్బాయిల గురించి తాను ఏం చెప్ప‌ను అని అన్న స‌మంత‌ వాళ్ళ పాజిటివ్, నెగెటివ్స్ వారే చెప్పుకోవాలి అన‌డంతో ఒక్కొక్క‌రు  త‌మ గురించి చెప్పుకున్నారు.

అనంతంర బిగ్ బాస్ హౌజ్‌లో స్వ‌యంవ‌రం న‌డిచింది. హౌజ్‌లో ఉన్న  అమ్మాయిల‌ని ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు ఏదైన టాస్క్ చేయాల‌ని అన‌డంతో ముందుగా వ‌చ్చిన అభిజిత్ ఓ పాట పాడారు. సోహైల్ త‌న కండ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.  అవినాష్‌.. త‌న‌ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం న‌వ్విస్తాన‌ని హామీ ఇచ్చాడు. నా భార్యకు నేనే వండిపెడ‌తా, ఏమ‌డిగినే ఇచ్చేస్తాన‌ని చెప్పి మెహ‌బూబ్ చొక్కా తీసేసి డ్యాన్స్ చేశాడు. ఇక చివ‌రిగా అఖిల్ త‌నని చేసుకోబోయే అమ్మాయిని కంటికి రెప్ప‌లా చూసుకుంటాన‌ని చెప్పి బంగారు క‌ళ్ల బుచ్చ‌మ్మ అనే పాట పాడారు. దీంతో అరియానా, దివి, హారిక‌, మోనాల్ ఫుల్ ఇంప్రెస్ అయి అఖిల్‌ని విజేత‌గా ప్ర‌క‌టించారు. లాస్య‌, రాజ‌శేఖ‌ర్, నోయ‌ల్ పెళ్ళి పెద్ద‌లుగా ఉన్నారు. అఖిల్ స్వ‌యంవ‌రం గేమ్‌లో గెల‌వ‌డంతో అతనికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది స‌మంత 

ఇంటి స‌భ్యులు మాట్లాడిన వీడియోని చూపించ‌డంతో అఖిల్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. అఖిల్ త‌ల్లి మాట్లాడుతూ.. నువ్వు గుర్తొచ్చిన‌ప్పుడు నీ రూంలోకి వెళ్ళి నీ కోస‌మే ఆలోచిస్తున్నాం. గేమ్ బాగా ఆడు అదే మాకు సంతోషం అని చెప్ప‌డంతో అఖిల్‌కు కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్టు అయింది.