మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 07:00:01

స్టైలిస్ట్‌తో మ‌రీ ఇంత చ‌నువుగానా.. స‌మంత పిక్ వైర‌ల్

స్టైలిస్ట్‌తో మ‌రీ ఇంత చ‌నువుగానా.. స‌మంత పిక్ వైర‌ల్

అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌తి రోజు ఏదో ఒక టాపిక్‌తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. ఓ సారి హాట్ పిక్స్‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంటే మ‌రోసారి స్ట‌న్నింగ్ విష‌యాలు రివీల్ చేస్తూ స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు స్టైలీష్ట్, డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్‌తో నాది నాలుగేళ్ల బంధం అని చెప్పుకొచ్చింది. అక్క‌డితో ఆగ‌కుండా త‌న కాళ్ళ‌ను ప్రీత‌మ్ ఒళ్ళో పెట్టి ప‌డుకున్న ఫొటోని షేర్ చేసి అంద‌రు నోరెళ్ళ‌పెట్టేలా చేసింది  స‌మంత. 

ప్ర‌స్తుతం ఈ  ఫొటోపై నెటిజ‌న్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే స‌మంత ఫొటోకు ప్రీతమ్ ఐల‌వ్యూ అని రిప్లై ఇవ్వ‌డంతో అసలు ఏం నడుస్తుంది అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్ళింది. అక్క‌డ ఫ్రెండ్స్‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది.  

VIDEOS

logo