శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 10:59:48

నన్ను న‌మ్మినందుకు థ్యాంక్స్ మామ: స‌మంత‌

నన్ను న‌మ్మినందుకు థ్యాంక్స్ మామ: స‌మంత‌

నాగ‌చైతన్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన స‌మంత ఎక్క‌డ అడుగుపెడితే అక్క‌డ శుభం క‌లుగుతుంది. ఇప్ప‌టికే సినిమాల‌లో చాలా అదృష్టం క‌లిసి రాగా ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా మారింది. బిజినెస్‌ల వైపు కూడా స‌మంత దృష్టి సారించ‌గా, అందులోను త‌ప్ప‌క స‌క్సెస్ సాధిస్తుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు న‌టిగానే అల‌రించిన స‌మంత ద‌స‌రా రోజు హోస్ట్‌గా ప్రేక్ష‌కుల‌కి కావల‌సినంత వినోదాన్ని అందించింది. పంచ్‌లు, జోక్స్‌, సెటైర్స్ ఇలా స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు  వేస్తూ హౌజ్‌మేట్స్‌ని కూడా ఓ ఆట ఆడించింది. వ్యాఖ్యాత‌గా స‌క్సెస్ అయిన స‌మంత‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుండ‌గా, దీనిపై త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది స‌మంత‌. 

బిగ్‌బాస్ స్టేజీ మీద హోస్ట్‌గా చేస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. మామ ఇచ్చిన బాధ్య‌త‌తో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాను.యాంక‌రింగ్ అనుభ‌వం లేదు, తెలుగుపై ప‌ట్టు లేదు, బిగ్ బాస్ షో ఒక్క‌టి కూడా చూడ‌లేదు. అయిన న‌న్ను న‌మ్మి నాకు హోస్టింగ్ బాధ్య‌త‌ను అప్ప‌గించిన మామ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.ద‌స‌రా మ‌హా ఎపిసోడ్ త‌ర్వాత  మీ నుండి వ‌స్తున్న ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు అని స‌మంత పేర్కొంది.