శనివారం 30 మే 2020
Cinema - Mar 28, 2020 , 00:45:26

క్వారంటైన్‌ టైమ్స్‌

క్వారంటైన్‌ టైమ్స్‌

నాయకానాయికల కెరీర్‌ మొత్తం షూటింగ్‌లు, ప్రచారాలతోనే గడిచిపోతుంటుంది. అగ్రకథానాయికలైతే విరామం లేకుండా ఏడాదంతా బిజీగా కనిపిస్తూనే ఉంటారు. కొద్దిగా విశ్రాంతి దొరికినా కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తితో హోమ్‌ క్వారంటైన్‌ను పాటిస్తున్న తారలంతా ఈ విరామంలో ఫ్యామిలీ టైమ్‌ను ఆస్వాదిస్తున్నారు.   బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇన్నాళ్ల ఎడబాటును మరిపిస్తూ ఈ ఆనందోత్సాహాల్ని అభిమానులతో  సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సమంత తన భర్త నాగచైతన్య కోసం వంట చేస్తున్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. లంచ్‌ ప్రిపరేషన్‌ అంటూ ఆమె పెట్టిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటున్నది.  క్వారంటైన్‌ టైమ్‌ను  చై, సామ్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని అభిమానులు చెబుతున్నారు.


logo