గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 13:00:43

నా భ‌ర్త‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు: స‌మంత‌

నా భ‌ర్త‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు: స‌మంత‌

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత‌లు వైవాహిక జీవితంలో అద్భుత క్ష‌ణాల‌ని ఆస్వాదిస్తున్నారు. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ,  వైవాహిక జీవన పయనంలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. నేటి( అక్టోబ‌ర్ 6)తో సమంత‌, చైతూల వివాహం జ‌రిగి మూడేళ్ళు పూర్తి కాగా, సామ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న భ‌ర్తకు వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపింది. 

నువ్వు నా మ‌నిషివి. నేను నీ దానిని. మ‌నం ఏ ద్వారం ద‌గ్గ‌ర‌కు వెళ్లినా, ఇద్ద‌రం క‌లిసే దానిని తెరుస్తాం. వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు నా భ‌ర్త నాగ చైత‌న్య అంటూ పోస్ట్ పెట్టింది. ఈ క్యూట్ జంట‌కు రానా, ఉపాస‌న‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు విషెస్ అందిస్తున్నారు. కాగా, స‌మంత న‌టిగానే కాకుండా బిజినెస్ ఉమెన్‌గాను అడుగులు వేస్తుంది.