e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ట్రైల‌ర్‌తో స‌మంత పాత్ర‌పై క్లారిటీ వ‌స్తుంది: ఫ‌్యామిలి మ్యాన్2 ద‌ర్శ‌కుడు

ట్రైల‌ర్‌తో స‌మంత పాత్ర‌పై క్లారిటీ వ‌స్తుంది: ఫ‌్యామిలి మ్యాన్2 ద‌ర్శ‌కుడు

ట్రైల‌ర్‌తో స‌మంత పాత్ర‌పై క్లారిటీ వ‌స్తుంది: ఫ‌్యామిలి మ్యాన్2 ద‌ర్శ‌కుడు

అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం చాలా ప‌రిణితితో క‌నిపిస్తుంది. సినిమాలు కాని, డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాంలో కాని ఆమె ఎంపిక అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. గ‌త ఏడాది డిజిట‌ల్ ఫ్లాంలో విడుద‌లైన ది ఫ్యామిలీ మెన్ ఎంత విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలి సీజ‌న్‌లో మ‌నోజ్ బాజ్‌పేయ్, ప్రియ‌మ‌ణి, ష‌రీబ్ హ‌ష్మి,నీర‌జ్ మాధ‌వ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రెండో సీజ‌న్‌లో స‌మంత‌ను ప్ర‌త్యేక పాత్ర కోసం ఎంపిక చేశారు రాజ్ అండ్ డీకే.

ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో స‌మంత నెగెటివ్ పాత్ర పోషిస్తుంద‌ని, ఆమె టెర్ర‌రిస్ట్‌గా క‌నిపించనుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం న‌డుస్తూ వ‌చ్చింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు రాజ్ అండ్ డీకే. చిత్రంలో స‌మంత‌ది విల‌న్ పాత్ర అని చెప్ప‌లేం కాని మ‌నోజ్ బాజ్‌పేయ్‌కి గ‌ట్టి పోటీ ఇచ్చే పాత్ర‌గా ఉంటుంది. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నుండ‌గా, దీంతో స‌మంత పాత్ర‌పై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని వారు పేర్కొన్నారు. కాగా స‌మంత ప్ర‌స్తుతం శాకుంత‌లం అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

ఆర్టీపీసీఆర్‌లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్‌లో భూకంపం
ఉస్మానాబాద్‌ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రైల‌ర్‌తో స‌మంత పాత్ర‌పై క్లారిటీ వ‌స్తుంది: ఫ‌్యామిలి మ్యాన్2 ద‌ర్శ‌కుడు

ట్రెండింగ్‌

Advertisement