ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 11:02:07

సమంత దిన‌చ‌ర్య ఎలా మొద‌ల‌వుతుంది అంటే...!

సమంత దిన‌చ‌ర్య ఎలా మొద‌ల‌వుతుంది అంటే...!

సమంత అక్కినేనికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..? పెళ్ళి తర్వాత కూడా ఇప్పటికీ అదే క్రేజ్ కంటిన్యూ చేస్తుంది. సినిమాలు పక్కనబెడితే వెబ్ సిరీస్ లతో పాటు డిజిటల్ మీడియాలో కూడా సత్తా చూపిస్తుంది స్యామ్. స్యామ్ జామ్ అంటూ ఆహాలో ఆహా అనిపిస్తుంది తన హోస్టింగ్‌తో. ప్రస్తుతం చైతూతో కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తుంది సమంత అక్కినేని. ఇదిలా ఉంటే తాజాగా తన డే ఎలా మొదలవుతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది సమంత. సినిమాలు ఉన్నా లేకపోయినా తన దినచర్య మాత్రం ఒకేలా ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

పొద్దున్నే లేవగానే తానేం చేస్తాననేది పూస గుచ్చినట్లు చెప్పింది అక్కినేని కోడలు. ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే జాగింగ్ తో మొదలు పెట్టి ఇంకా చాలా చేస్తుంది సమంత. జిమ్ లోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది. షూటింగ్స్ ఉన్నా లేకపోయినా ఉదయం 5 గంటలకు లేవడం సమంతకు అలవాటు. అప్పట్నుంచే తన దినచర్య మొదలవుతుందని.. జాగింగ్ తో మొదలు పెట్టి జిమ్ లోనే 3 గంటలు గడిపేస్తుంది సమంత. 

ఆ తర్వాత తను కొత్తగా మొదలు పెట్టిన ఫార్మింగ్ పై ఫోకస్ చేస్తుంది సమంత. ఈ మధ్యే తన ఇంటిపైనే వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది సమంత. అక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన కెరీర్ గురించి టైమ్ కేటాయిస్తుంది. సినిమాలకు దూరంగానే ఉన్నా.. వెబ్ సిరీస్, డిజిటల్ మీడియాతో బిజీ అయిపోయింది సమంత. మరీ ముఖ్యంగా ఈ మధ్యే క్లోత్స్ షోరూం కూడా మొదలు పెట్టింది సమంత అక్కినేని.