గురువారం 04 జూన్ 2020
Cinema - May 12, 2020 , 11:59:49

సాహ‌స‌యాత్ర‌కి సిద్ధ‌మైన స‌మంత‌

సాహ‌స‌యాత్ర‌కి సిద్ధ‌మైన స‌మంత‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతస సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. కాని మ‌ధ్య‌లో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉంది. ఇటీవ‌ల గాఢ నిద్ర నుండి మేల్కొన్నానని పోస్ట్ పెట్టిన సామ్ ఆ త‌ర్వాత క్వారంటైన్ పోస్ట్‌ల‌తో పాటు పాత జ్ఞ‌పకాల‌ని షేర్ చేస్తుంది. తాజాగా చైతూతో దిగిన‌ పాత ఫోటోని షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

నాగ చైత‌న్య‌,స‌మంత‌, వారి పెంపుడు కుక్క ముగ్గురు క‌లిసి కారులో ఎక్క‌డికో బ‌య‌లుదేరుతూ ఫోటో దిగారు. ఆ ఫోటోని స‌మంత తాజాగ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. `దాదాపు ఓ గొప్ప సాహ‌స‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్నాం` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫోటో అక్కినేని అభిమానుల‌తో పాటు స‌మంత అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 


logo