బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Aug 25, 2020 , 13:21:40

స‌మంత ఇంట్లో ఈ వారం మెనూ.. అన్నీ క్యారెట్ వంట‌కాలే!

స‌మంత ఇంట్లో ఈ వారం మెనూ.. అన్నీ క్యారెట్ వంట‌కాలే!

క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల‌లో ఆరోగ్యంపై దృష్టి పెట్టిన స‌మంత .. అర్బన్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ స్వగృహంలోని టెర్రస్‌పై ఏర్పాటు చేసుకున్న తోటలో సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలతో పాట కూరగాయల్ని పండించింది.  ఆరోగ్య శ్రేయస్సుతో పాటు పర్యావరణ సంరక్షణ కోసమే తాను ఇంటివద్ద కూరగాయల్ని పండిస్తున్నానని చెప్పుకొచ్చింది.  అంతేకాక గ్రో విత్ మీ అనే ఛాలెంజ్ మొద‌లు పెట్టిన‌ సామ్ తనలానే ఇంట్లో కూరగాయలు పెంచాలని పిలుపునిచ్చారు

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇంట్లో చేస్తున్న వ్య‌వ‌సాయంకి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్న స‌మంత తాజాగా క్యారెట్‌లు ప‌ట్టుకొని దిగిన ఫోటోల‌ని షేర్ చేసింది.  ఆ ఫోటోల‌కి.. ఈ వారం మెనూ, క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా` అని కామెంట్ పెట్టింది. గ్రో విత్ మీ లో భాగంగా ఇవి పండించానంటూ పేర్కొంది సామ్.logo