బుధవారం 03 జూన్ 2020
Cinema - May 07, 2020 , 09:49:24

ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటున్న స‌మంత‌

ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటున్న స‌మంత‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత లాక్‌డౌన్‌ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాల‌నే దానిపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దొరికిన ఈ అమూల్య‌మైన స‌మ‌యంలో న‌‌ట‌న‌లో కొత్త పాఠాలు నేర్చుకోవాల‌ని భావిస్తుంది. ఇందుకోసం  ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌పై దృష్టి కేంద్రీక‌రించింది. రానున్న రోజుల‌లో న‌టిగా నాలో మ‌రింత వైవిధ్యం క‌నిపించ‌నుంది. ఒక‌వేళ మంచి న‌టిని అనిపించుకోక‌పోతే ఈ పోస్ట్‌ని తొల‌గిస్తాన‌ని స‌మంత చెప్పడం విశేషం.

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో త‌న న‌ట‌న‌తో ఎంతగానో అల‌రిస్తున్న స‌మంత న‌ట‌నపై మ‌రింత ప‌ట్టు సారించేందుకు ఎంత‌గానో దృష్టి పెడుతున్న‌ట్టు తాజా పోస్ట్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇటీవ‌ల నిధి అగ‌ర్వాల్ కూడా త‌న ఇంట్లో ఉండి ఆన్‌లైన్ క్లాసుల‌లో న‌ట‌న‌పై శిక్ష‌ణ పొందిన విష‌యం తెలిసిందే .logo