శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 25, 2020 , 15:54:33

నాగ‌ర‌త్తమ్మ బ‌యోపిక్‌.. ఇద్ద‌రిలో ఎవరికి ఛాన్స్?

నాగ‌ర‌త్తమ్మ బ‌యోపిక్‌.. ఇద్ద‌రిలో ఎవరికి ఛాన్స్?


దేశ‌వ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల్లో బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది.  అస‌మాన ప్ర‌తిభాపాట‌వాల‌తో వివిధ‌రంగాల్ని ప్ర‌భావితం చేసిన ప్ర‌ముఖుల జీవితాలు వెండితెరపై దృశ్య‌మానమ‌వుతున్నాయి. ఈ కోవ‌లోనే సీనియ‌ర్ నాయిక స‌మంత....ప్ర‌ముఖ క‌ర్ణాట‌క గాయ‌ని,  న‌ర్త‌కి, సాంస్క్ర‌తిక ఉద్య‌మ‌కారిణి, దేవ‌దాసి.. బెంగ‌ళూరు నాగ‌ర‌త్త‌మ్మ జీవిత క‌థ‌లో నటించ‌బోతున్న‌ట్లు తెలిసింది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

క‌ర్ణాట‌క సంగీత ప్రాచుర్యానికి విశేష కృషిచేయ‌డంతో పాటు త్యాగ‌రాజ ఆరాధ‌నోత్స‌వాల‌కు ఆద్యురాలిగా నాగ‌ర‌త్త‌మ్మ గొప్ప ఘ‌న‌త‌ను సాధించారు. మ‌హిళా హ‌క్కుల కోసం పోరాడారు. స్పూర్తిదాయ‌కంగా సాగిన ఆమె జీవిత క‌థ‌ను నేటి త‌రాల‌కు తెలియ‌జేసేందుకు భారీ స్థాయిలో ఈ సినిమాకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో తొలుత స‌మంత పేరును ప‌రిశీలించ‌గా...పాన్ ఇండియా కోణంలో దీపికా ప‌దుకునే పేరు సైతం తెర‌మీదికొచ్చింద‌ని చెబుతున్నారు.  ఈ ఇద్ద‌రి తార‌ల‌కు క‌థ వినిపించ‌గా సినిమాకు అంగీక‌రించార‌ని...వారిలో ఎవ‌రు సినిమాలో భాగ‌మ‌వుతార‌నే విష‌యంలో త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.


logo