సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 09:20:27

బిగ్ బాస్ హోస్ట్‌గా స‌మంత‌.. ఈవారం ఎలిమినేష‌న్ లేన‌ట్టేనా?

బిగ్ బాస్ హోస్ట్‌గా స‌మంత‌.. ఈవారం ఎలిమినేష‌న్ లేన‌ట్టేనా?

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం నేటితో ఏడువారాలు పూర్తి చేసుకోబోతుంది.  గ‌త ఆరువారాల‌కి హోస్ట్‌గా ఉన్న నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలీ వెళ్ళ‌గా, ఆయన స్థానాన్ని కోడ‌లు స‌మంత భ‌ర్త చేస్తుంది . శ‌నివారం ఎపిసోడ్ హోస్ట్ లేకుండా సాగిపోగా, ఆదివారం రోజు స‌మంత ఇంటి స‌భ్య‌ల‌తో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ స్టేజ్‌పై స‌మంత చేసిన సంద‌డికి సంబంధించి ప్రోమోలు విడుద‌ల చేయ‌గా, ఇవి సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ద‌సరా సంద‌ర్భంగా సాయంత్రం ఆరు గంట‌ల‌కు బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. రాత్రి 9గం.ల వ‌ర‌కు ఈ షో ప్ర‌సారం కానుండ‌గా, మూడు గంట‌ల పాటు స‌మంత హౌజ్‌మేట్స్‌తో చేసే సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందా అని ఫ్యాన్స్ లెక్క‌లు వేసుకుంటున్నారు. గ‌త సీజ‌న్‌లో కూడా నాగార్జున అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల‌న ర‌మ్య‌కృష్ణ రెండు ఎపిసోడ్‌ల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఆ స‌మ‌యంలో ఎలిమినేష‌న్ ప్రాసెస్‌ని తాత్కాలికంగా ర‌ద్దు చేశారు. మరి ఈ రోజు కూడా అలానే జ‌రుగుతుందా అనేది చూడాలి.