ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 10:46:20

ఆ ఫొటోను డిలీట్‌ చేసిన సమంత!

ఆ ఫొటోను డిలీట్‌ చేసిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌తి రోజు త‌న అకౌంట్‌లో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో విల‌న్‌గా నటించిన స‌మంత దీని ప్ర‌మోష‌న్ కోసం ముంబై వెళ్ళింది. అక్క‌డ త‌న స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. నాలుగేళ్ల బంధం మాది అని పేర్కొంది. దీనికి ప్రీత‌మ్ ఐ ల‌వ్ యూ అని కామెంట్ పెట్టాడు.

అయితే ఎంత చ‌నువు ఉంటే మాత్రం అలా ఆయ‌న మీద కాళ్ళు పెట్టి  ఫొటో దిగ‌డం  ఏంటి?  ఆయ‌న దీనికి ఐ ల‌వ్ యూ అని రిప్లై ఇవ్వ‌డ‌మేంట‌ని తెగ ట్రోల్ చేశారు. దీంతో స‌మంత ఆ పోస్ట్‌ని వెంట‌నే తొల‌గించింది. స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించ‌నున్న శాకుంత‌లం చిత్రంలో స‌మంత శ‌కుంత‌ల‌గా న‌టించనుంది. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

VIDEOS

logo