గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 11, 2020 , 09:09:20

చిరు సినిమాలో సమంత‌..!

చిరు సినిమాలో సమంత‌..!

వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్న స‌మంత టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. రీసెంట్‌గా జాను అనే సినిమాతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది సామ్‌. తాజాగా స‌మంత‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో స‌మంత కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న స‌మంత‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.  రామ్ చరణ్‌తో కలిసి దాదాపు 40 నిమిషాల పాటు క‌నిపించ‌నున్న స‌మంత‌.. చిరుతో ఏ ఫ్రేంలో క‌నిపించ‌ద‌ట‌. సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిరు 152వ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. త్రిషని క‌థానాయిక‌గా ఎంపిక చేసినట్టు టాక్.


logo