బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 16:05:52

సమంత అభిమానులకు సంబురం

సమంత అభిమానులకు సంబురం

అవును..ఇప్పుడు సమంత అభిమానుల ఆనందం ఇలాగే వుంది. సాధారణంగా ఎప్పుడూ సోషల్‌మీడియాలో ఉత్సాహంగా వుంటూ అందులో రకరకాల పోస్ట్‌లు.. చైతుతో చిలిపితగదాల విశేషాలు ఇలా అన్ని సోషల్‌మీడియాలో పంచుకునే సమంత  లాక్‌డౌన్‌ ప్రారంభం నుండి సోషల్‌మీడియాలో ఇన్‌  యాక్టివ్‌గా వుంది. ఇక ఎట్టకేలకు తన పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియాలో అభిమానులను పలకరించింది. తమ అభిమాన తార మళ్లీ రావడంతో సమంత అభిమానులు ఫుల్‌ కుషీ అవుతున్నారు. అంతేకాదండోయ్‌ రీసెంట్‌గా ‘ఓబేబీ’టీమ్‌ ప్రత్యేకంగా తయారుచేసిన సమంత పెంపుడు కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియోను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో సమంత కూడా ఎంతో యాక్టివ్‌గా కనిపించింది. ఇక సమంత సోషల్‌ మీడియాలో మునుపటిలా అన్ని విశేషాలను తమతో షేర్‌ చేసుకుంటుందని ఆమె అభిమానులు ఆనందంగా వున్నారు.


logo