క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు డిజిటల్ వరల్డ్లోను తన సత్తా చూపాలని భావిస్తుంది. ఇటీవల ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ షో కోసం హోస్ట్‌గా మారిన సమంత, అమెజాన్ ప్రైమ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో విలన్‌గా నటించింది. ఫిబ్రవరి 12న ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సమంతకు ట్విట్టర్,అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ది ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత పాత్రని ఎమోజీగా రూపొందించి విడుదల చేశారు. ఇది చూసిన సామ్ సంతోషించింది.
మనోజ్ బాజ్‌పాయ్ ,సమంతతో ఉన్న ఎమోజీని అమెజాన్ ప్రైమ్,ట్విట్టర్ విడుదల చేయగా, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఓ కథానాయికకి సంబంధించి ఎమోజీ విడుదల కావడం ఇదే తొలిసారి కాగా, తమ అభిమాన నటి ఈ ఘనత సాధించినందుకు ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ .. రాజ్, డీకేలు తెరకెక్కించగా, ఇందులో ప్రియమణి కూడా ముఖ్య పాత్ర పోషించింది.