ఏ మాయ చేశావే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత తన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లింది. అందం చందంతో పాటు అభినయంలో కూడా మేటి అనిపించుకున్న సమంత కెరీర్ ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ అదే అణుకువతో ఉంటుంది. అందుకే అభిమానులు ఆమెను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఏప్రిల్ 28 సమంత బర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్స్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు విషెస్ అందిస్తున్నారు.
సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ రిలీజ్ చేయగా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని క్రియేట్ చేశారు. అలాగే సౌత్ రాజ్యానికి సామ్ ను క్వీన్ లా చూపిస్తూనే సీడీపీలో ఆమె నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు(pratyusha, ekam) కూడా పొందుపరిచారు . అదే విధంగా మాస్క్ ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ ట్యాగ్స్ తో అవగాహన కల్పించేలా ప్రయత్నం చేశారు. ఈ సీడీపీ ఆకట్టుకుందటుంది. ఇక సమంత తన మేనేజర్‌తో కలిసి 34వ బర్త్‌డే జరుపుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సామ్ ఇప్పుడు కాతువకుల రెండు కాదల్ ,శకుంతలం సినిమాలు చేస్తోంది.