ప్రభాస్ ఎక్కడ.. సమంత ఎక్కడా..? ఈ ఇద్దరికి ఎక్కడ పోలిక ఉందబ్బా అనుకుంటున్నారు కదా..? ప్రభాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. మరోవైపు సమంత కూడా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఈ ఇద్దరూ తమ తమ స్థానాల్లో టాప్ లోనే ఉన్నారు. పాన్ ఇండియన్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ప్రభాస్ అందరికంటే ముందున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్ అయిపోయాడు ఇప్పుడు. హిందీలోనూ ఈయన సినిమాలకు మంచి మార్కెట్ వచ్చేసింది. సాహో అక్కడ 150 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ రేంజ్ చూపించింది. అలాంటి ఈయనకు సమంత ఎలా పోటీ అనుకుంటున్నారా..?
సమంత అక్కినేని కూడా పాన్ ఇండియన్ మార్కెట్ కోసం బాగా ట్రై చేస్తుంది. ఈమె కంటే ముందు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, శృతి హాసన్ లాంటి హీరోయిన్లు అంతా బాలీవుడ్ వెళ్లొచ్చారు. కానీ వెళ్లి వచ్చారంతే.. అక్కడ ఏం మాయ చేయలేకపోయారు. అయితే సమంత మాత్రం వెళ్లడంతోనే పిచ్చెక్కించింది. ఈమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. మనోజ్ బాజ్పెయీ హీరోగా నటించిన ఈ సిరీస్ ను రాజ్ డికే దర్శక ద్వయం తెరకెక్కించారు. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
సినిమాలకు మించిన ఇమేజ్ ఈ సిరీస్ కు వచ్చింది. ముఖ్యంగా ఇందులో నటించిన వాళ్లకు కూడా చాలా క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా సమంత అక్కినేని పోషించిన శ్రీలంకన్ రెబల్ రాజీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సిరీస్ తర్వాత సమంత కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇంతకాలం సౌత్ లో ఏం చేస్తున్నారంటూ ఈమెను అడుగుతున్నారు. మరోవైపు ఇంకో వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు సమంత ముందు నిలిచింది. మొత్తానికి హీరోలలో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోతే.. ఈయనకు ధీటుగా హీరోయిన్లలో సమంత ముందుకు వెళ్తుందన్నమాట.
ఇవి కూడా చదవండి..
రవితేజ డైరెక్టర్ ఎక్జయిటింగ్ అనౌన్స్ మెంట్..!
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!