శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 19:43:51

స‌మంత అక్కినేని చ‌ర్మ‌సౌంద‌ర్యానికి కార‌ణం ఇదేన‌ట‌!

స‌మంత అక్కినేని చ‌ర్మ‌సౌంద‌ర్యానికి కార‌ణం ఇదేన‌ట‌!

స‌మంత అక్కినేని. అటు హీరోయిన్ గాను, ఇటు కోడ‌లిగాను మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో  అడుగుపెట్టి ఇనేండ్లు అవుతున్నా త‌న చ‌ర్మం సౌంద‌ర్యం మాత్రం ఏ మాత్రం తగ్గ‌లేదు. అందుకు కార‌ణం స‌మంత చేసే యోగాల‌తో పాటు మ‌రొక‌టి ఉంద‌ట‌. దాని గురించి వివ‌రిస్తూ వీడియో పోస్ట్ చేశారు.

ఇంత‌కీ అదేంటంటే. ఫేస్ మ‌సాజ‌ర్‌. దీంతో ముఖాన్ని కాసేపు అలా మ‌సాజ్ చేసుకుంటే ముఖం ఎంతో మృదువుగా ఉండ‌డంతోపాటు కాంతివంతంగా మెరుస్తుంది.బ‌హుశా ఇదే స‌మంత బ్యూటీ సీక్రెట్ ఏమో. ఇటీవ‌ల స‌మంత ఫ్యాష‌న్ లేబుల్ గురించి అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక సినిమా విష‌యాల‌కు వ‌స్తే స‌మంత చివ‌రిసారిగా క‌నిపించిన తెలుగు చిత్రం జాను. ఆ త‌ర్వాత మ‌నోజ్ బాజ్‌పేయి న‌టిస్తున్న‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌లో క‌నిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ అక్టోబ‌ర్‌లో ప్ర‌సారం అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.