ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 16:32:44

ర‌కుల్‌, సారాల‌కు సారీ చెప్పిన స‌మంత అక్కినేని

ర‌కుల్‌, సారాల‌కు సారీ చెప్పిన స‌మంత అక్కినేని

రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ కేసులో 25 బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయ‌నే వార్త‌ల‌ను ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్ట‌ర్  కెపిఎస్ మ‌ల్హోత్ర కొట్టిప‌డేప‌డేశారు. మేము ఎలాంటి బాలీవుడ్ ప్ర‌ముఖుల లిస్ట్ ప్రిపేర్ చేయ‌లేద‌ని వెల్ల‌డించారు. గ‌త రెండు రోజులుగా డ్రగ్స్ కేసులో సారా, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ల పేర్లు ఉన్నాయ‌నే వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. ఇందులో వాస్త‌వాలేంట‌నేది నిర్థారించ‌కుండానే వారిని అనుమానించారు. స‌మంత అక్కినేని ఈ విష‌యంపై త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.

'ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సారా అలీ ఖాన్ క్ష‌మించండి' అని పోస్ట్ చేశారు. స‌మంత సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. త‌ను చేసే ప్ర‌తిప‌నిని అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇటీవ‌ల బ‌ట్ట‌ల బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది స‌మంత‌. ఎన్‌సిబి అధికారులు రిపోర్ట్ చేసిన వెంట‌నే చాలామంది సెల‌బ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌మ‌ అభిప్రాయాల‌ను పంచుకున్న వారిలో స‌మంత ఒక‌రు. 


logo