గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 05, 2020 , 20:42:41

చైతన్యకు విడాకులు ఇచ్చేయ్.. సమంతతో అభిమాని చాటింగ్!

చైతన్యకు విడాకులు ఇచ్చేయ్.. సమంతతో అభిమాని చాటింగ్!

హైదరాబాద్‌: తెలుగు ఇండస్ట్రీలో సోషల్ మీడియా స్టార్ ఎవరంటే సమంత అక్కినేని అనే సమాధానం వస్తుంది. చాలా మంది హీరోలకు కూడా లేని ఫాలోవర్స్ ఈమెకున్నారు. సోషల్‌మీడియాలో స్టార్‌హీరో మహేశ్‌బాబు కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటే  సమంత ఏ రేంజ్ లో అక్కడ రచ్చ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని వెంటనే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది సమంత. ఇదే ఆమెను వాళ్లకు మరింత చేరువ చేస్తున్నది. 

ఇదిలా ఉంటే, ఒక్కోసారి వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో అభిమానులకు చెబుతోంది సమంత అక్కినేని. దానికి వాళ్లు రియాక్ట్ అయినప్పుడు అంతే సరదాగా రివర్స్ కౌంటర్ కూడా వేస్తుంది. 

తాజాగా, ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు తన జీవితంలో జరిగే విషయాల గురించి కూడా చెప్తూ ఉంటుంది సమంత. దాంతో ఫ్యాన్స్ కూడా ఆమెను అంతే బాగా ఓన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు మనసు విప్పి మాట్లాడుకుంటారు.


 తాజాగా సమంత ఒక ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకి ఒక అభిమాని చాలా సరదాగా కామెంట్ చేశాడు 'చై (నాగ చైతన్య) కి విడాకులు ఇచ్చేయ్. మనిద్దరం పెళ్లి చేసుకుందాం'. అని కామెంట్ పెట్టాడు. దానికి సమంత కూడా అంతే సరదాగా రిప్లై ఇచ్చింది. ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకుండా అభిమానికి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది అక్కినేని ఇంటి కోడలు. 

'కష్టం. ఒక పని చెయ్. చై ని అడుగు' అని  సమంత ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ఎవరికి నచ్చినట్టు వాళ్లు మీమ్స్ కూడా క్రియేట్ చేసి సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఏదేమైనా అభిమానితో ఇంత సరదాగా మాట్లాడడం అనేది అంత చిన్న విషయం కాదు. అందుకే సమంత ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ఈమెకు కోట్ల మంది ఫాలోవర్స్ ఉండడానికి కారణం కూడా ఇదే.


logo