సోమవారం 25 మే 2020
Cinema - Apr 02, 2020 , 09:07:55

బ‌యోపిక్‌లో స‌మంత‌..త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

బ‌యోపిక్‌లో స‌మంత‌..త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

అక్కినేని స‌మంత ప్ర‌స్తుతం మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న చిత్రాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్న‌ట్టు అర్ద‌మ‌వుతుంది. యూ ట‌ర్న్‌, ఓ బేబి వంటి చిత్రాల‌తో అల‌రించిన స‌మంత తాజాగా  ఓ బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవిత నేప‌థ్యంలో సింగీతం శ్రీనివాస‌రావు ఓ బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం అనుష్క పేరు వినిపించింది.

కానొ తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌యోపిక్‌లో స‌మంత న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. నాగ‌ర‌త్న‌మ్మ‌.. దేవ‌దాసిగా పుట్టి సంగీత క‌ళాకారిణిగా ఎదిగి జీవిత చ‌ర‌మాంకంలో యోగినిగా మారింది. త‌న సంప‌ద‌నంతా క‌ళ‌ల‌కు, క‌ళాకారుల‌కు ధార‌పోసింది.  ఆమె పాత్ర‌ని ఛాలెంజ్‌గా తీసుకొని స‌మంత చేయ‌నుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo