శుక్రవారం 10 జూలై 2020
Cinema - May 29, 2020 , 23:08:31

మూడు పచ్చడి సీసాలు ఖాళీ చేశా!

మూడు పచ్చడి సీసాలు ఖాళీ చేశా!

‘ద్వేషించేవారే నాలో స్ఫూర్తిని నింపుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆ వాస్తవాన్ని వారు  గ్రహించడం లేదు. ప్రశంసలు నాలో సోమరితనాన్ని పెంచుతాయి. విమర్శలు నా పనిలో   ఉత్తమ ప్రతిభ కనబర్చడానికి  దోహదపడతాయి’ అని అంటోంది సమంత అక్కినేని.  శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిందీ సొగసరి..

అత్తయ్య అమలతో మీకు ఉన్న అనుబంధం గురించి ఏం చెబుతారు?

మంచి స్నేహితురాలు, మార్గదర్శి. 

మీరు, చైతన్య ఇద్దరిలో ఎవరూ ఎక్కువ సమయం వర్కవుట్స్‌ చేస్తుంటారు?

నా కంటే చైతన్యనే ప్రతి రోజు జిమ్‌లో ఎక్కువ సమయం కష్టపడతాను. నేను వర్కవుట్స్‌ చేస్తున్నట్లుగా నటిస్తుంటాను.

ఎప్పటికీ మీరు ఇష్టపడే మంచి సినిమా?

ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌. నా బాల్యం నుంచి  ఈ సినిమాను ఇష్టపడుతున్నాను. చూసిన ప్రతిసారి కొత్త కోణంలో ఆవిష్కృతమైన అనుభూతి కలుగుతుంది.

క్వారంటైన్‌ టైమ్‌లో మీరు నేర్చుకున్న  గొప్ప విషయం?

నిరంతరం  కలల వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు కలలు  కుటుంబం  రూపంలో మన ఇంట్లోనే ఉంటాయి.   

అభిమానులు మీపై కొన్ని సందర్భాల్లో చూపించే అంతులేని ప్రేమను చూస్తుంటే  ఏమనిపిస్తుంది?

వారి నిస్వార్థమైన ప్రేమకు నేను అర్హురాలినే అనిపిస్తుంది. 

క్వారంటైన్‌ టైమ్‌లో ఫిట్‌గా ఉండటానికి  మీరు ఎంచుకున్న మార్గమేది?

అప్పుడప్పుడూ  ఉపవాసం ఉంటా. అదికూడా బలవంతంగానే ఉపవాసం ఉండటానికి ప్రయత్నిస్తా. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం.  రోజు విడిచి రోజు లంచ్‌లోకి బిర్యానీ ఉండాల్సిందే. అలాగే స్పైసీ ఫుడ్‌ను ఎక్కువగా తింటుంటాను. క్వారంటైన్‌ టైమ్‌లో మూడు పచ్చడి బాటిల్స్‌ను ఖాళీచేశాను.  ఉపవాసాలు శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుతాయి.

సెలబ్రిటీ స్టేటస్‌ వల్ల కష్టమనిపించే అంశం..?

కొన్నిసార్లు మన గురించి ప్రచారంలో ఉన్న అబద్ధాలను వినాల్సిన పరిస్థితులు వస్తుంటాయి.

‘ఫ్యామిలీమాన్‌-2’ సిరీస్‌ కోసం నార్త్‌ ఇండియన్‌ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు?

వారితో పాటు నేను కూడా ఈ వెబ్‌సిరీస్‌ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

లాక్‌డౌన్‌ విరామంలో చైతన్య కోసం మీరు వంట చేస్తున్నారట?

అవును.

అభిమానుల గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు?

వారే నా బలం, బలహీనత.

గోంగూర పచ్చడి రుచి చూశారా?

చాలా సార్లు తిన్నా. ఇప్పుడు గోంగూర మొక్కల్ని పెంచుతున్నా.

చైతన్య గురించి ఒక్క మాటలే చెప్పాలంటే?

హ్యాపీనెస్‌. 

లాక్‌డౌన్‌ టైమ్‌లో నేర్చుకున్న కొత్త వంటకం?

షాక్‌ షుకా(గుడ్డు, టామాటా మిశ్రమంతో కూడిన వంటకం)

రష్మిక మందన్నలో మీకు నచ్చిన లక్షణం?

రష్మికలో కష్టపడేతత్వం ఎక్కువ. తన డ్యాన్స్‌ బాగుంటుంది.


logo