అక్కినేని కోడలిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత సమంతలో చాలా పరిణితి కనిపిస్తుంది. ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ మరో వైపు మోడ్రన్ బిజినెస్‌లు చేస్తుంది. రోజురోజుకి టెక్నాలజీతో పాటు ఆధునికత కూడా పెరుగుతూ మార్పులు చెందుతుండడంతో సమంత ఆ వైపు అడుగులు వేస్తుంది. ఇటీవలే సాకీ పేరుతో ఫ్యాషన్ బిజినెస్ మొదలు పెట్టగా ఇది సమంతకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందట.
సాకీ అనేది ఆన్లైన్ బిజినెస్ కావడంతో విదేశాకు చెందిన వారు కూడా ఆర్డర్స్ చేస్తున్నారట. సాకీ స్టోర్ దుస్తులను అమెరికా సింగపూర్ మలేషియా దేశాలకు కూడా పంపిస్తున్నాం” అంటూ ఇటీవలె సమంత తన పోస్ట్‌లో తెలియజేసింది.ఇక ఇదిలా ఉంటే సమంత త్వరలో జ్యువలరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందట. ఇప్పటికే తన ఫ్రెండ్ తమన్నా ‘వైట్ అండ్ గోల్డ్’ అనే పేరుతో ఆన్లైన్ జ్యువలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదేబాటలో సామ్ కూడా పయనిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ అనే రెండు సినిమాలలో నటిస్తోంది.