గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 08:06:32

స‌మంత‌, సోన‌మ్ సేమ్ టూ సేమ్!

స‌మంత‌, సోన‌మ్ సేమ్ టూ సేమ్!

అక్కినేని కోడ‌లు స‌మంత‌, బాలీవుడ్ బ్యూటీ సోన‌మ్ క‌పూర్‌ల‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్ద‌రు భామ‌లు ఫ్యాష‌నిస్ట్‌లుగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. వెరైటీ స్టైల్‌లో డ్రెస్టింగ్ వేసి దానికి తగ్గ జ్యువ‌ల‌రీ ధ‌రించి వావ్ అనిపిస్తూ ఉంటారు. అయితే స‌మంత బాలీవుడ్ బ్యూటీల‌ను ఎక్క‌వుగా అనుసరిస్తుంద‌నే టాక్ ఉంది. అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ డ్రెస్సింగ్‌లను సామ్ ప‌లు సార్లు కాపీ కొట్టింద‌నే టాక్ ఉంది. 

తాజాగా సోనమ్ ధరించిన ఓ డిజైనర్ చీరకట్టులో సమంత తళుకుబెళుకులు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. సేమ్ టూ సేమ్ అంటూ ప‌లు కామెంట్స్ వ‌స్తున్నాయి. అయితే ఇద్ద‌రిలో ఎవ‌రు అందంగా ఉన్నార‌నే చ‌ర్చ కూడా మొద‌లు పెట్టేశారు నెటిజన్స్. 2018 లో ఒక పండుగ సందర్భంగా సోనమ్ కపూర్  మసాబా ప్రింటెడ్ చీర ధరించి క‌నిపించ‌గా, సమంతా అక్కినేని  ఒక ఈవెంట్ కోసం అదే డిజైనర్ చీర ధరించి త‌ళుక్కుమంది  


logo