టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సాధారణంగా యువ హీరోలతో సినిమాలు చేయడం అరుదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది. కొత్తదనంతో కూడిన కథలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. కొత్త దర్శకులు ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా కథలను రాసుకుంటున్నారు. సీనియర్ హీరోలు కూడా ఇపుడు యంగ్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు.
తాజాగా బాలకృష్ణ ఓ యువ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ బాలయ్యను డైరెక్ట్ చేయబోయే ఆ యువ దర్శకుడెవరో తెలుసా..? ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీ అట్లూరి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ కథను రాస్తున్నాడట వెంకీ.
సితార సంస్థ ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపై సందడి చేస్తుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్