బుధవారం 03 జూన్ 2020
Cinema - May 16, 2020 , 07:42:42

స‌మంత‌- చైతూ బైక్ స‌వారీ..!

స‌మంత‌- చైతూ బైక్ స‌వారీ..!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ స‌మంత‌- నాగ చైత‌న్య జంట ఫోటోలు ఫ్యాన్స్‌కి ఎప్పుడు థ్రిల్‌ని క‌లిగిస్తూనే ఉంటాయి. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత త‌ర‌చు త‌మ ఫోటోల‌ని షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. ఈ మ‌ధ్య కొద్ది రోజులు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉన్న స‌మంత తిరిగి పోస్ట్‌లు పెడుతుంది.

ఇటీవ‌ల త‌న భ‌ర్త‌తో పాటు పెట్ డాగ్‌తో క‌లిసి కారులో దిగిన పిక్‌ని షేర్ చేసిన సామ్ తాజాగా తన భర్త, హీరో నాగచైతన్యతో పిలియన్‌ బైక్‌పై కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో చైతూ హెల్మెట్ ధ‌రించ‌గా స‌మంత వెనుక  బ్యాగ్ వేసుకొని చేతిలో హెల్మెట్ ప‌ట్టుకొని ఉంది. నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం వీరు బ‌య‌ట‌కి వెళ్లేందుకు సిద్ధ‌మైన‌ట్టు ఈ ఫోటోని బ‌ట్టి తెలుస్తుంది. 


logo