మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 18, 2021 , 12:02:38

నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: స‌మంత‌

నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: స‌మంత‌

క్యూట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య ఇటు సినిమాలు లేదంటే అటు సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌తో అభిమానులని ఆనందింప‌జేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా నాగ చైత‌న్య త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేయ‌గా, దానికి స‌మంత ఇచ్చిన చిలిపి కామెంట్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

కొద్ది రోజుల క్రితం ల‌వ్ స్టోరీ అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసిన నాగ చైత‌న్య ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే షూటింగ్ స‌మ‌యంలో సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ చైతూని ఫొటో తీయ‌గా, దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు నాగ చైత‌న్య‌. చీక‌ట్లో కూర్చొని దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, ఈ ఫొటోకు నెటిజ‌న్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. స‌మంత.. నా గురించే ఆలోచిస్తున్నావా అంటూ ఫ‌న్నీ  కామెంట్ పెట్ట‌గా, ఈ పోస్ట్ ప్ర‌స్తుతం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. 

VIDEOS

logo