మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 14:37:49

ఎపిసోడ్ కు సల్మాన్ కు రూ.16 కోట్లు పారితోషికం..!

ఎపిసోడ్ కు సల్మాన్ కు రూ.16 కోట్లు పారితోషికం..!

హిందీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు విశేష ప్రేక్షకాదరణ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోకు సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్. బిగ్ బాస్ షో 10 సీజన్లకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ 14 సీజన్ కు ప్లాన్ జరుగుతుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే సల్మాన్ ఖాన్ గతంలో ఎన్నడూ లేనంతగా బిగ్ బాస్ 14 సీజన్ కు  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బిగ్ బాస్ సీజన్ 14లో ఎపిసోడ్ కు రూ.16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

బిగ్ బాస్ సీజ్ 4-6లకు ఎపిసోడ్ రూ.2.5 కోట్లు తీసుకున్న సల్మాన్.., సీజన్ 9కు  7-8 కోట్లు తీసుకోగా..బిగ్ బాస్ సీజన్ -12కు రూ.12-14 కోట్లు తీసుకున్నాడు. మరి సీజన్లు పెరుగుతున్న కొద్దీ సల్మాన్ ఖాన్  తన పారితోషికాన్ని కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడని అర్థమవుతుంది. 


logo