సారీ చెప్పిన సల్మాన్ ఖాన్..ఎగ్జిబిటర్లకు గుడ్‌న్యూస్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే. సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి సల్మాన్‌ఖాన్ సానుకూలంగా స్పందించాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎగ్జిబిటర్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘అందరికీ సారీ.. చాలా కాలం కిందట నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతిన్న థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్ల సమస్యలు తెలుసుకున్నా. వారి విజ్ఞప్తి మేరకు రాధే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసి ఆర్థికంగా వారికి అండగా నిలుస్తానని సల్మాన్ తన సందేశంలో పేర్కొన్నాడు. రాధేను థియేటర్లలో విడుదల చేయడం వల్ల ఎగ్జిబిటర్లు కోరుకున్న మొత్తాన్ని తిరిగి అందుకుంటారని భావిస్తున్నా. ఆ దేవుడి కృపతో..ఈద్ 2021కు రాధేను థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేయండి’ ..అంటూ సల్మాన్ పోస్ట్ లో పేర్కొన్నాడు.
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు రావడంతో..డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సల్మాన్ ఖాన్ ను కలిసి కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాధే చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్‌ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
రాశీఖన్నాకు నో చెప్పిన గోపీచంద్..!
శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.