కుర్రకారుతో పోటీ పడేందుకు సల్మాన్ ఖాన్ తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. కండలవీరుడిగా పేరు తెచ్చుకున్న సల్మన్ ఖాన్ ఇప్పటికీ తన ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆరు పదుల వయసుకు దగ్గర కు వచ్చినా కూడా కండలు కొంచెం కూడా తగ్గకుండా చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్.. టైగర్ 3 సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అద్బుతమైన తన ఫిజిక్ ను మరింతగా పెంచుకునేందుకు సల్మాన్ ఖాన్ జిమ్లో భారీగా కసరత్తులు చేస్తున్నాడు. తన సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ వర్కవుట్ వీడియో షేర్ చేయా,ప్రస్తుతం వైరల్ గా మారింది. 55 ఏళ్ల వయస్సులోను సల్మాన్ డెడికేషన్ చూసి అంతా షాకవుతున్నారు.