సోమవారం 25 మే 2020
Cinema - Jan 28, 2020 , 16:39:44

అభిమాని సెల్‌ఫోన్‌ లాక్కున్న సల్మాన్‌ఖాన్‌..

అభిమాని సెల్‌ఫోన్‌ లాక్కున్న సల్మాన్‌ఖాన్‌..

పానాజీ: అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించినపుడు బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సల్మాన్‌ఖాన్‌ కోపంతో ఊగిపోయిన సందర్బాలు చూశాం.  తాజాగా సల్మాన్‌కు చిర్రెత్తుకొచ్చే ఘటన ఒకటి జరిగింది. సల్మాన్‌ఖాన్‌ గోవా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నపుడు ఓ అభిమాని అతని దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అభిమాని ప్రవర్తన సల్మాన్‌కు మరోసారి కోపం తెప్పించడంతో..అతని సెల్‌ఫోన్‌ లాక్కున్నుడు సల్లూభాయ్‌. ఈ ఘటనపై దర్యాప్తు చేశాం. సల్మాన్‌తో సెల్ఫీ దిగాలనుకున్న ఆ వ్యక్తి ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి చెందినవాడుగా గుర్తించామని ఎయిర్‌పోర్ట్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదన్నారు. గతంలో కూడా కొందరు అభిమానులు బాంద్రాలో సైకిల్‌పై వెళ్తున్న సల్మాన్‌ఖాన్‌ ను ఫాలో అవుతూ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. logo