ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 12:54:13

రైతుగా మారిన స‌ల్మాన్.. ఫోటో వైర‌ల్

రైతుగా మారిన స‌ల్మాన్.. ఫోటో వైర‌ల్

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుండి స‌ల్మాన్ ముంబై శివార్ల‌లో ఉన్న ప‌న్వెల్ ఫాం హౌజ్‌లోనే ఉంటున్నారు. స‌ల్మాన్‌కి తోడుగా లులియా వాంట‌ర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉన్నారు. అయితే క‌రోనా స‌మ‌యంలో ప్ర‌కృతి మ‌ధ్య ఎక్కువ‌గా సెద తీరుతున్న స‌ల్మాన్ ఖాన్ తాజాగా రైతుగా మారాడు.

త‌న ఫాం హౌజ్‌లో నాట్లు నాటుతున్న‌ట్టు ఫోటోకి ఫోజివ్వగా దానిని త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌కి తినేవాడి పేరు ధాన్యం మీద రాసి ఉంటుంది. జై జ‌వాన్ జై కిసాన్ అంటూ కామెంట్‌గా రాసాడు.  లాక్‌డౌన్ స‌మ‌యంలో ప‌న్వెల్ హౌజ్‌లో ఉన్న స‌ల్మాన్ చుట్టు ప‌క్క‌ల వారికి సహాయ స‌హ‌కారాలు అందించారు. స‌ల్మాన్ న‌టిస్తున్న రాధే సినిమా త్వ‌ర‌లో షూటింగ్ జ‌రుపుకోనుండ‌గా, స్డూడియోలో వేసిన సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నారు. ఇందులో దిశా ప‌టానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  ప్రభుదేవా-సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం రాధే. ఈ మూవీలో రణ్‌దీప్‌ హుడా, జాకీష్రాప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo