మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 14:27:49

ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్న వార‌సుడు..!

ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్న వార‌సుడు..!

ఇండ‌స్ట్రీలో వార‌సుల హంగామా కొనసాగుతూనే ఉంది. తాజాగా విల‌క్ష‌ణ నటుడు  మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మషి బ్యాడ్ బాయ్ అనే చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. రాజ్‌కుమార్ సంతోషి మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. కొద్ది సేప‌టి క్రితం స‌ల్మాన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ్యాడ్ బాయ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా న‌మిషికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ .. పోస్ట‌ర్ అద్భుతంగా ఉంది అని కామెంట్ పెట్టారు.

బ్యాడ్ బాయ్ చిత్రంలో న‌మ‌షీ చ‌క్ర‌వ‌ర్తి స‌ర‌స‌న అమ్రిన్ ఖురేషీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ అమ్మ‌డికి ఈ చిత్రం డెబ్యూ మూవీనే కానుంది.  చిత్రంలో డ్రామా, మ్యూజిక్, యాక్ష‌న్, రొమాన్స్ కీల‌క భూమిక పోషిస్తాయ‌ని ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ అన్నారు. బ్యాడ్ బాయ్ చిత్రం నా క‌ల‌ని నిజం చేయ‌నుంద‌ని న‌మిషి స్ప‌ష్టం చేశాడు. సినిమా షూటింగ్‌లో ప్ర‌తి క్ష‌ణం ఫుల్‌గా ఎంజాయ్ చేశాను అని పేర్కొన్నాడు.


logo