బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తన కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో సినిమా చేయబోతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. స్వీయ నిర్మాణ సంస్థ సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై దాదాపు మూడొందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రకృతికి, మనిషికి మధ్య నడిచే ఓ సంవాదంలా ఈ సినిమా ఉండబోతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.