శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 04, 2020 , 22:08:42

చిరు సినిమాలో సల్మాన్‌?

చిరు సినిమాలో సల్మాన్‌?

‘సైరా’ తర్వాత సినిమాల వేగాన్ని పెంచారు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారాయన. ఈ చిత్రం తర్వాత ‘లూసిఫర్‌' రీమేక్‌ను మొదలుపెట్టనున్నారు.  పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ఖాన్‌ కీలక అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.  ఈసినిమా ద్వారా సల్మాన్‌ఖాన్‌ దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టనున్నట్లు చెబుతున్నారు. మలయాళ మాతృకలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రలో ఈ బాలీవుడ్‌ స్టార్‌ కనిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్‌కు సంబంధించి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసే పనిలో దర్శకుడు సుజిత్‌ బిజీగా ఉన్నారు. 

సల్మాన్‌ ఔదార్యం

లాక్‌డౌన్‌ కారణంగా పన్వెల్‌లోని ఫార్మ్‌హౌస్‌లో చిక్కుకుపోయిన సల్మాన్‌ఖాన్‌ నలభైరోజులుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో సామాజిక బాధ్యతను చాటుకుంటూ ఫార్మ్‌హౌస్‌ సమీపంలోని గ్రామప్రజలకు నిత్యవసరాల్ని స్వయంగా పంపిణీచేశారు సల్మాన్‌ఖాన్‌. ప్రియురాలు లూలియా వంథూర్‌, నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో పాటు మరికొందరు మిత్రులతో కలిసి నిత్యవసరాల్ని అందించారు. ఈ వీడియోను  ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు సల్మాన్‌ఖాన్‌. logo